Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తలపించేలా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నగర నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహా గణపతిని దర్శించుకుంటున్నారు. రాత్రి సమయం సమీపించే కొద్దీ బడా గణేష్ దర్శన లైన్లు కిటకిటలాడుతున్నాయి. సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన నాలుగు క్యూ లైన్లతో పాటు వీఐపీ మార్గం కూడా పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయింది. తోపులాటలు జరగకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తులు క్యూ లైన్లలో నిలబడి త్వరగా స్వామివారిని దర్శించుకునేలా రోప్ పార్టీ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లపై ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి ఎన్టీవీతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. ఉత్సవాలు ముగిసే వరకు తొమ్మిది రోజుల పాటు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద అత్యంత పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబాలతో వచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా షీ టీమ్స్ సిబ్బందిని రంగంలోకి దించారు. రద్దీని ఆసరా చేసుకుని తిరిగే పోకిరీలు, ఈవ్ టీజర్లు అలాగే జేబుదొంగలు, పిక్ పాకెటర్లపై నిఘా ఉంచేందుకు నిపుణులైన పోలీసులను నియమించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికతో భద్రతా చర్యలు చేపట్టారు.
Also Read
- Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
- Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
- Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
- Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం రాదు..
భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు భారీ స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేక అధికారుల బృందం నిరంతరం సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను పర్యవేక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలతో పాటు, చివరి రోజు అత్యంత వైభవంగా జరిగే నిమజ్జన ఊరేగింపు పూర్తయ్యే వరకు ఇదే స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమల్లో ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో గణపతిని దర్శించుకునేలా అన్ని విభాగాల సమన్వయంతో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల పర్యవేక్షణ, పటిష్టమైన బందోబస్తు మధ్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పూజలు పూర్తి చేసుకుని వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
-
Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం రాదు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!