BRS KTR: బీఆర్ఎస్ లోనే గౌరవం ఉందన్న ఈటల మాటను గుర్తుపెట్టుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS KTR: బీఆర్ఎస్ లోనే తనకు గౌరవం ఉండేదని పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ… మల్కాజిగిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సే అన్నారు. అది ఈటల రాజేందర్ కి కూడా తెలుసన్నారు. మల్లారెడ్డి అన్న మాట అంతరార్థం తెల్వక కొంతమంది ఆగమావుతున్నారని మండపిడ్డారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన సరే… శ్రేణులు అంతా వెళ్లడం అసాధ్యమన్నారు. బీఆర్ఎస్ లోనే తనకు గౌరవం ఉండేదని పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ మారిన కేకే, రంజిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు.
Read also: Fire Accident: బ్రెజిల్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అన్నారు. తాను ఇంఛార్జ్ ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందని సీఎం బాధ్యతలు నుంచి తప్పుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులవి చిల్లర, ఉద్దెర మాటలన్నారు. ప్రజలందరికీ కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని అర్థమైందన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలంతా మళ్లీ మోసపోకుండా జాగ్రత్త పడాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోసం పార్ట్ – 1 నుంచి రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ -2 మొదలు పెట్టిండని తెలిపారు. దేవుళ్ళ సాక్షిగా ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండని అన్నారు. ఆగస్ట్ 15న రుణమాఫీ అని మరోసారి రైతులను మోసం చేసే పని పెట్టుకున్నాడని తెలిపారు.
Read also: Bandi Snajay: అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా..
రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కలు మొక్కుతున్నాడని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది సచ్చేది లేదన్నారు. అందుకే దేవుడి పైన ఒట్లు పెడుతూ ప్రజలను మోసం చేసే పని పెట్టుకున్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాడు? మోడీ నాయకత్వంలోనా? రాహుల్ గాంధీ నాయకత్వంలోనా ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కచ్చితంగా బీజేపీలో చేరతాడు. ఇప్పటికి 20 సార్లు నేను ఈ మాట చెప్పిన సరే ఆయన కనీసం ఎందుకు స్పందించటం లేదన్నారు. వంద రోజుల్లో చేస్తా అన్న పనిని కనీసం 250 రోజుల్లో అయినా తర్వాత కూడా చేయవా రేవంత్ రెడ్డి? అని మండిపడ్డారు. అందుకే రేవంత్ రెడ్డిని స్పందించాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Read also: High Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
దమ్ముంటే హరీష్ రావు సవాల్ కు రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. ఆయన మోసం పార్ట్-2 ఇది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండని తీరుగానే రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉండదన్నారు. ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకే రేవంత్ రెడ్డి కట్టుబడి లేడన్నారు. ఆయన ఏ శవాలుకి కట్టుబడి ఉన్నాడో చెప్పాలె? అని ప్రశ్నించారు. గతంలో కొడంగల్ లో గెలవటం జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ విజయం వంటి ప్రతిసారి మాట తప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నా అని తెలిపారు. ఇతర చాలా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మాకు ఉన్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లో గెలుస్తున్నారని తెలిపారు. మల్లారెడ్డి రాజకీయ అనుభవంతో వ్యూహంతోనే ఆ కామెంట్ చేశారన్నారు. ఈటెల రాజేందర్ ని మునగ చెట్టు ఎక్కిచ్చి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని తెలిపారు.
BRS KTR: దురదృష్టవశాత్తు ఓడిపోయాం.. మళ్ళీ అధికారంలోకి వస్తాం..
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి