Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డూ వేలం పాట.. తొలిసారి లడ్డూ వేలం పాటను ప్రారంభించి రికార్డు సృష్టించిన బాలాపూర్ గణపతి ఎంతో ప్రాముఖ్యత ఉంది.. ఈ వేలం పాట మొదటిసారిగా 1994 సంవత్సరంలో కేవలం రూ.450తో ప్రారంభం కాగా.. ప్రతీ ఏడాది క్రమంగా పెరుగుతూ.. లక్షలు పలుకుతోంది.. గత ఏడాది కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ 21 కిలోల లడ్డూను రికార్డు స్థాయిలో రూ. 35 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు.. ఇక, ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ కొత్త రికార్డులు సృష్టిస్తుంది అనడం సందేహం లేదంటున్నారు భక్తులు..
బాలాపూర్ గణపయ్య లడ్డూను దక్కించుకున్న వారికి అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, వ్యవసాయంలో మంచి పంట వస్తుందని భక్తుల విశ్వాసం.. ఇక, బాలాపూర్ గణపతి లడ్డూ వేలంపాటకు సర్వం సిద్ధమైంది. 21 కిలోల లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు, దాతలు భారీ ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వేలంలో పాల్గొనేందుకు ఇప్పటివరకు ఎనిమిది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
Also Read
మరోవైపు.. బాలాపూర్ గణేశుడికి చివరి రోజు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్వాహకులు ఉద్వాసన పూజను నిర్వహించారు. అనంతరం గణేశుడి ఊరేగింపు కార్యక్రమాన్ని బాలాపూర్ వీధుల్లో నిర్వహించనున్నారు. ఇక, ఉదయం 10 గంటల ప్రాంతంలో బాలాపూర్‌లోని బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలంపాట జరగనుంది. ఈసారి వేలంలో సామ ప్రణీత్ రెడ్డి, మర్రి రవికిరణ్ రెడ్డి, కందాడి శాలిని వీరేందర్ రెడ్డి, కంచర్ల శివారెడ్డి, సామ దయానంద్ రెడ్డి, గడ్డం నవీన్ రెడ్డి, శ్రీకాంత్, ఇబ్రాం ప్రత్యూష్ పాల్గొననున్నారు. గత ఏడాది లడ్డూను లింగాల దశరథ గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. ఈసారి ఆ రికార్డు ధరను అధిగమిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!