KTR : డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం.. ప్రజాప్రతినిధులంతా ముందుకు రావాలి
- డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని కేటీఆర్ స్పష్టం
- ప్రజాప్రతినిధులందరూ పరీక్షలు చేయించుకోవాలన్న పిలుపు
- డ్రగ్స్ వినియోగాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్
- ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నోటీసుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్ అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన విమర్శలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీటుగా స్పందించారు. తనపై వస్తున్న అనుమానాలను పటాపంచలు చేసేందుకు ఎలాంటి పరీక్షలకైనా తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని, ఆయనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలంటూ మహేశ్ గౌడ్ చేసిన సూచనను కేటీఆర్ స్వాగతించారు. “నేను ఏ క్షణమైనా, ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని గతంలోనే పలుమార్లు స్పష్టం చేశాను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను” అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి డ్రగ్స్ వాడటం అత్యంత దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
కేవలం తాను మాత్రమే కాకుండా, రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. “మనం పరీక్షలు చేయించుకుని సమాజానికి ఆదర్శంగా ఉందాం. డ్రగ్స్ వాడకాన్ని, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. డ్రగ్స్ వినియోగించే వారు ఎంతటి వారైనా సరే.. వారిని కఠినంగా శిక్షించాల్సిందే” అని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో తన పేరును డ్రగ్స్ కేసులోకి లాగాలని చూస్తే ఊరుకోబోనని కేటీఆర్ హెచ్చరించారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తే చట్టపరంగా నోటీసులు జారీ చేస్తానని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని, యువతను పాడు చేస్తున్న ఈ సంస్కృతిని నిర్మూలించడంలో రాజీ పడబోమని ఆయన పేర్కొన్నారు.
CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..
తాజావార్తలు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
-
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!