KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
- 95% రిజర్వేషన్లపై కేటీఆర్
- కేసీఆర్ పోరాటం ఫలితం
- ఉద్యోగాల భర్తీ వివరాలు
- కాంగ్రెస్‌పై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బీఆర్ఎస్ యువజన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నిరుద్యోగుల కోసం చేపట్టిన విప్లవాత్మక నిర్ణయాలను, నియామకాల వివరాలను పంచుకున్నారు. ముఖ్యంగా స్థానిక అభ్యర్థుల హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జోనల్ విధానంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్ల పోరాటం.. కేంద్రం మెడలు వంచి 95% రిజర్వేషన్ల సాధన
తెలంగాణలోని స్థానిక అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లు కల్పించే సరికొత్త జోనల్ వ్యవస్థను తీసుకురావడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర సంవత్సరాల పాటు నిరంతరం కష్టపడ్డారని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ 95 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను మొదట్లో కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా, కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఇక్కడి ప్రత్యేక పరిస్థితులను ప్రధానికి వివరించి, వారిని ఒప్పించి ఈ చారిత్రాత్మక జోనల్ విధానానికి ఆమోదం ముద్ర వేయించారని స్పష్టం చేశారు.
Also Read
- Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
- Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై 'ఈగిల్ ఫోర్స్' ఉక్కుపాదం
- Hyderabad Rains: రెండు నెలల తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
తప్పులను సరిదిద్దాం.. రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ
గత తొమ్మిదిన్నర ఏళ్ల తమ పాలనలో చేపట్టిన ఉద్యోగ నియామకాలను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీజీఎస్పీఎస్సీ (TGSPSC) పేపర్ లీక్ వంటి కొన్ని పొరపాట్లు జరిగాయని ఆయన బహిరంగంగానే అంగీకరించారు. అయితే, ఆ తప్పులను కేవలం గుర్తించడమే కాకుండా, బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకున్నది కూడా తమ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. నియామకాల గణాంకాలను వివరిస్తూ.. తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా 2,32,308 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, అందులో 26,083 ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని కేటీఆర్ వివరించారు.
తాజావార్తలు
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
-
Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!