Hyderabad Rains: రెండు నెలల తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
- రెండు నెలల తర్వాత నగరంలో కుండపోత వర్షం
- తూర్పు నుంచి పడమర వరకు జోరుగా వాన
- భారీ వర్షంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన ఉక్కపోతతో భయాందోళన చెందుతున్న హైదరాబాద్ ప్రజలకు వరుణుడు భారీ ఉపశమనం అందించాడు. శీతాకాలం ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం వేళల్లో తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు రెండు నెలల తర్వాత శుక్రవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడింది.
తూర్పు నుంచి పడమర వరకు తడిసిముద్దయిన నగరం
మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ కాగా, సాయంత్రానికి నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. పశ్చిమ హైదరాబాద్‌లోని మణికొండ, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ, షేక్‌పేట్, మెహదీపట్నం, రాజేంద్రనగర్‌లతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లలో వర్షం దంచికొట్టింది. ఇక తూర్పు, ఉత్తర భాగాలైన ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, సరూర్‌నగర్, కాప్రా, కీసర, ఘట్కేసర్, బోడుప్పల్, చర్లపల్లి ఏరియాలు తడిసిముద్దయ్యాయి. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్, కంచన్‌బాగ్, శాలిబండ తదితర ప్రాంతాల్లోనూ వర్షం ధాటికి రహదారులు జలమయమయ్యాయి.
Also Read
- Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
- TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
- CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- Indiramma Family Life Insurance: తెలంగాణ కుటుంబాలకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త బీమా పథకం షురూ
ఒక్కసారిగా స్తంభించిన ట్రాఫిక్.. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద మోకాలి లోతు నీరు
సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలోనే కుండపోత వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్‌తో పాటు ఉప్పల్-మేడిపల్లి మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 117 వద్ద రహదారిపై నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రంగంలోకి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు
వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ తక్షణమే రంగంలోకి దిగాయి. డ్రెయినేజీల్లో అడ్డంకులను తొలగిస్తూ, రోడ్లపై నిలిచిన వరద నీటిని బయటకు పంపించే పనులను వేగవంతం చేశాయి. మరోవైపు, వర్షంతో రహదారులు జలమయమైనందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రయాణించాలని అధికారులు కోరారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
-
Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!