KTR Tweet: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఉద్యోగ క్యాలెండర్’పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు స్పందించారు. ఉద్యోగాలపై ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. దీంతో కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా జాబ్ క్యాలెండర్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో గల్లీ గల్లీలో తిరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కేటీఆర్ తన ఎక్స్ లో ఖాతాలో విమర్శించారు. ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి 8 నెలలు దాటిందని, ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు.
Read also: TRAI: మొబైల్ నెట్‌వర్క్ లో అంతరాయం ఏర్పడితే..వినియోగదారులకు పరిహారం!
ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తామో చెప్పకుండా నిరుద్యోగ క్యాలెండర్ విడుదల చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు వచ్చినట్లుగానే ఒక్కసారి హైదరాబాద్ లోని అశోక్ నగర్ కు రాహుల్ రావాలని కేటీఆర్ ఆహ్వానించారు. అక్కడ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతతో మాట్లాడి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో యువతతో తాను మాట్లాడుతున్న వీడియోను తన ఎక్స్‌లో పంచుకున్నారు.. తమకు పోరాటం కొత్త కాదని కేటీఆర్ అన్నారు. తనను అరెస్ట్ చేసి రాత్రికి రాత్రే విడుదల చేయడంపై స్పందించిన కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో.. ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని నమ్మించిన రాహుల్ గాంధీపై అవసరమైతే ఢిల్లీలో పోరాటం చేస్తానని చెప్పారు. తిట్టినా, దూషించినా ప్రశ్నిస్తూ, నిరసిస్తూనే ఉంటామన్నారు.
Priyadarshi: ప్రియదర్శి హీరోయిన్ గా నిహారిక?