Niharika NM to Act Opposite Priyadarshi: కమెడియన్గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత హీరోలుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రియదర్శి పులికొండ కూడా ఒకరు. మల్లేశం సినిమాతో హీరోగా మరి నాయన తర్వాత జాతి రత్నాలు, బలగం ఈ మధ్య వచ్చిన డార్లింగ్ అనే సినిమాలు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా కోసం ఒక ఫేమస్ కంటెంట్ క్రియేటర్ హీరోయిన్ గా మారుతున్నట్లుగా చెబుతున్నారు. ఆమె ఇంకెవరో కాదు నిహారిక ఎన్ఎం. అమెరికాలో చదువుకున్న ఆమె తమిళనాడుకు చెందిన వ్యక్తి.
Mahesh babu : మహేశ్ సినిమాల రీరిలిజ్ క్రేజ్ మామూలుగా లేదుగా..
అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే మంచి వీడియోలు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించింది. మేజర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, కేజిఎఫ్ రిలీజ్ టైంలో యష్ సహా పలువురు పెద్ద హీరోలతో కలిసి ఆ సినిమాలను ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య ఆమె పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. అప్పుడే ఆమె ఏదో సినిమా చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా ఏమిటనేది క్లారిటీ వచ్చింది. ప్రియదర్శి హీరోగా నిహారిక హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది.