KTR : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలను ప్రదర్శించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీను నిర్ధారించకుండా నిలిపి, రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో నిలబడని జీఓ (గవర్నమెంట్ ఆర్డర్) ద్వారా బీసీలకు హామీ ఇచ్చినట్లు మభ్యపెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో, ఎన్నికల సమీపంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసంని హైకోర్టు ఆపిందని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ తనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక, ఎన్నికల వాయిదా కోసం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకుందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిన గుణపాఠాన్ని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కేటీఆర్ హెచ్చరించారు.