KTR : రాహుల్, రేవంత్‌లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
- రేవంత్, రాహుల్‌తో చర్చకు సిద్ధం: కేటీఆర్
- జూపల్లి ఎందుకు వెనక్కి తగ్గారో అర్థం కాలేదు
- గన్ పార్క్ తర్వాత జూ పార్క్కే వెళ్లారేమో
- కాంగ్రెస్‌పై మెట్రో, అసెంబ్లీ చర్చల వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ ‘ఎన్టీవీ’ (NTV) కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ముఖ్యమంత్రి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించానని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ వచ్చినా చర్చకు సిద్ధం
తెలంగాణ అభివృద్ధి లేదా ఇతర ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, లేదా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గానీ ఎవరు చర్చకు వచ్చినా తాను సిద్ధమేనని నిన్ననే ప్రకటించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, అసలు సవాల్ విసిరిన వారు కాకుండా మధ్యలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు దూరాడో తనకు అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
సీఎల్పీ, గన్ పార్క్.. ఆ తర్వాత జూ పార్క్ కెళ్లారేమో
తానే స్వయంగా తెలంగాణ భవన్‌కు వస్తానని మంత్రి జూపల్లి ప్రకటించడంతో, ఉదయం నుంచి ఆయన కోసం తెలంగాణ భవన్లో వేచి చూశానని కేటీఆర్ తెలిపారు. కానీ జూపల్లి మాత్రం తెలంగాణ భవన్‌కు రాకుండా, కొద్దిసేపు సీఎల్పీ (CLP) లో ఉండి, ఆ తర్వాత గన్ పార్కులో వెయిట్ చేశారని విమర్శించారు. గన్ పార్క్ తర్వాత ఆయన బహుశా జూ పార్కుకు వెళ్లారేమో అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము గన్ పార్కుకు వెళ్తామంటే పోలీసులు రానీయకుండా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు.
వీళ్ల స్థాయికి కేసీఆర్ అవసరం లేదు
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టినా సరే తాము మాట్లాడటానికి , ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. “ఈ కాంగ్రెస్ నాయకుల స్థాయికి కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు.. ఆయన సైనికులుగా మేమే వీళ్లకు సమాధానం చెబుతాము” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేవలం డ్రామాలు ఆడుతోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!