Krishna River Management Board: తెలుగు రాష్ట్రాలకు లేఖ అనుమత్తుల్లేని వాటిని ఆపండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమతులు లేకుండా ప్రాజెక్టుల పనుల తక్షణమే నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (Krishna River Management Board) తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈనేపథ్యంలో.. కేంద్రం గతంలో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గడువు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాసిన బోర్డు, ఈ విషయాన్ని పేర్కొంది. దీంతో.. ప్రాజెక్టుల అనుమతులకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గడువు ఈనెల బుధవారం 13తో ముగిసింది. కాగా.. పనులు నిలిపి వేయాలని స్పష్టం చేస్తూ బోర్డు ఆంధ్రా, తెలంగాణకు లేఖలు రాసింది. అయితే.. అనుమతుల్లేని ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయని కృష్ణానదీ యాజమాన్య బోర్డు పేర్కొంది.
read also: Boris Johnson: ప్రధాని ఎవరైనా మంచిదే.. కానీ రిషి సునక్ మాత్రం వద్దు
Also Read
ఈనేపథ్యంలో.. గతేడాది జులై 15న కేంద్ర జలశక్తిశాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులు ఆపివేయాలని తెలిపింది. అయితే.. ఆదేశాలపై తగిన నివేదికలు ఇవ్వాలని నిరుడు జులైతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రెండు రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు గుర్తు చేసింది. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై చాలా వివాదాలు ఉన్నాయన్న బోర్డు, రెండు ప్రాజెక్టులకు చెందిన 15 కాంపొనెంట్లను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం జరిగినట్టు లేఖలో పేర్కింది. నిన్న జరిగిన 15వ కేఆర్ఎంబీ సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరిందని, కాంపొనెంట్ల స్వాధీనానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ఈనేపథ్యంలో.. బోర్డు తీసుకున్న ఈ కీలక నిర్ణయం అమలైతే వివాదాస్పద అంశాలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని లేఖలో పేర్కొంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!