Koppula Eshwar: అడ్లూరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.. మంత్రి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koppula Eshwar Warns Adduri Lakshman Kumar: 30 ఏళ్ల ప్రజా జీవితంలో తాను మచ్చలేని జీవితాన్ని గడిపానని.. ఎన్నికల రీకౌంటింగ్ గురించి అడ్లూరి లక్ష్మణ్ తనపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు అనంతరం అడ్లూరిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ రాష్ట్రా, కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో జరుగుతుందన్నారు. ఎలక్షన్ కమిషన్ పూర్తి స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని పేర్కొన్నారు. ధర్మపురి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ తనపై ఎన్నో ఆరోపణలు చేశారన్నారు.
Kottu Satyanarayana: పవన్‌ని చూస్తుంటే జాలేస్తోంది.. విషయం అర్థమైపోయినట్టుంది..!
Also Read
ఐఏ పిటిషన్‌లు వేసి, తీర్పు రాకుండా.. కేసును లక్ష్మణ్ కాలయాపన చేస్తున్నారని మంత్రి కొప్పుల చెప్పుకొచ్చారు. నిబంధనల ప్రకారమే.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు EVMలను ధర్మపురి కాలేజ్‌లో భద్రపరచారన్నారు. లక్ష్మణ్ కుమార్ అనుమానించిన పది బూతుల్లో ఎలాంటి ఓట్ల తేడాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ధర్మపురి ఎన్నిక ఫలితాలకు సంబందించి.. ఎక్కడైనా సరే చర్చించుకందామని లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు. ఎన్నికకు సంబందించిన సీసీ కెమెరా ఒరిజినల్ ఫుటేజ్ లక్ష్మణ్ దగ్గరే ఉందని.. దాన్ని కోర్టులో సమర్పించి, చిత్తశుద్ధి చాటుకో అని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు నా చేతిలో ఉన్నాయని లక్ష్మణ్ అనడం విడ్డూరమని అన్నారు. ప్రజాస్వామ్యంపై, న్యాయవ్యవస్థపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. తీర్పు త్వరగా వచ్చేలా వ్యవహరించాలని లక్ష్మణ్‌కి చెప్పారు.
MLC Jeevan Reddy: తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజలను దగా చేస్తోంది
కాగా.. 2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పోటీ చేయగా.. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో దిగారు. నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ పోరులో.. 441 ఓట్ల మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు. అయితే.. కొప్పుల ఈశ్వర్ గెలుపు కోపం అడ్డదారులు తొక్కారని లక్ష్మణ్ ఆరోపించారు. హైకోర్టుని కూడా ఆశ్రయించారు. లక్ష్మణ్ పిటిషన్‌ను తిరస్కరించాలంటూ.. మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. హైకోర్టు దీన్ని 2022 జూన్ 28వ తారీఖున కొట్టివేసింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!