Komatireddy Venkat Reddy : వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.. కోమటిరెడ్డి అత్యవసర నిర్ణయం
- రాష్ట్రవ్యాప్తంగా 1,039 కి.మీ రహదారులు దెబ్బతిన్నట్లు నివేదిక
- 31 చోట్ల రహదారులు తెగిపోగా, 356 ప్రాంతాల్లో నీటి ప్రవాహం
- తాత్కాలిక పునరుద్ధరణకు రూ. 53.76 కోట్లు అవసరం
- అత్యవసర చర్యల కోసం రూ. 100 కోట్ల నిధులు కోరనున్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లు, భవనాల (R&B) శాఖకు చెందిన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించారు. అధికారులను అప్రమత్తం చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Kamalinee Mukherjee: టాలీవుడ్లో నటించకపోవడానికి కారణం ఇదే..
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
మంత్రి కోమటిరెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు నష్టానికి సంబంధించిన తాజా నివేదికను సమర్పించారు. రాష్ట్రంలోని మొత్తం 37 ఆర్ అండ్ బి డివిజన్లలో 1039 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. ఈ నష్టంలో 794 వర్ష ప్రభావిత ప్రాంతాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా 31 చోట్ల రోడ్లు పూర్తిగా తెగిపోగా, 356 ప్రాంతాల్లో రోడ్లపై నుంచి నీరు ఓవర్ఫ్లో అవుతోంది. దీంతో ఇప్పటివరకు 3035 చోట్ల ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి.
రోడ్ల మరమ్మతుల కోసం అత్యవసరంగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక పునరుద్ధరణకు రూ. 53.76 కోట్లు, శాశ్వత మరమ్మత్తులకు రూ. 1157 కోట్లు అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో, తక్షణ చర్యల కోసం రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అధికారులు ఇప్పటికే 10 తెగిపోయిన రోడ్లను పునరుద్ధరించగా, 236 చోట్ల ట్రాఫిక్ను క్లియర్ చేసి సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారు.
Kim Jong Un’s Bulletproof Train: ఇది కదిలే కమాండ్ సెంటర్.. ఉత్తర కొరియా నియంత స్పెషల్ ట్రైన్
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!