తెలుగు సినిమా ప్రేక్షకులకు ‘ఆనంద్’ సినిమా పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే పేరు కమలినీ ముఖర్జీ. ఆ సినిమాలో ఆమె చేసిన ‘రూప’ క్యారెక్టర్‌తో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది . తర్వాత ఆమె నటించిన ‘గోదావరి’, ‘గమ్యం’ వంటి సినిమాలు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నటనలో సహజత్వం, పాత్రల ఎంపికలో ప్రత్యేకత ఆమెను త్వరగానే అందరి దగ్గరా ‘క్లాస్ యాక్ట్రెస్’గా నిలిపాయి. అయితే, గత దశాబ్దం నుంచి కమలినీ టాలీవుడ్‌కి దూరంగా ఉన్నారు. దానికి కారణం ఏమిటని అడిగితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
Also Read : War 2 : డిజిటల్ రిలీజ్‌కు రెడి అయిన ‘వార్ 2’ !
ఒక సినిమాలో తాను చేసిన పాత్ర, తన ఊహించినంత బలంగా, లోతుగా తెరపై రాలేదని చెప్పుకొచ్చారు. ఆ పాత్రపై వచ్చిన నిరాశ, అసంతృప్తి వల్లే తెలుగు సినిమాలకు దూరమయ్యానని ఆమె చెప్పడం గమనార్హం. కానీ ఆ మూవీ పేరు మాత్రం బయట పెట్టలేదు. అలాగే తాను కలిసి నటించిన హీరోల గురించి మాట్లాడుతూ కమలినీ.. ‘నాగార్జున ఇప్పటికీ ఆయన చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు. సహ నటులతో ఎప్పుడూ సరదాగా, ఎనర్జీతో ఉంటారు. శర్వానంద్ సహజంగా నటిస్తాడు. చాలా అంకితభావంతో పని చేస్తాడు. స్టార్ అని నిరూపించుకోవాల్సిన అవసరం అతనికి లేదు’ అంటూ ప్రశంసలు కురిపించారు. తెలుగులో ఆమె చివరిగా 2014లో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’. ఆ తర్వాత కమలినీ తమిళంలో ‘ఇరైవి’, మలయాళంలో ‘పులిమురుగన్’ వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండింటిలోనూ ఆమె నటన ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. మొత్తానికి చాలా కాలానికి కమలినీ కనిపించడంతో.. రీ ఎంట్రీ ఇవ్వండంటూ అభిమానులు కోరుతున్నారు.