Union Minister Nitin Gadkari Condected Review Meeting On Hyderabad-Vijayawada National Highway. Congress MP Komatireddy Venkat Reddy Attended the Meeting and Rised His Voice.
హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎన్‌హెచ్‌ఏ, జీఎంఆర్ ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరయ్యారు. ఈ సమీక్ష అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 4 లైన్ల హైవేని 6 లైన్ల హైవేగా మార్చడం ఆలస్యం అవుతుందని, ట్రాఫిక్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రికి వివరించానని తెలిపారు. హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ చేయకపోవడంపై ప్రధాన సమస్యగా మారిందని ఆయన అన్నారు. అగ్రిమెంట్ ప్రకారం జీఎంఆర్ 6 లేన్స్ గా హైవే ను విస్తరించాలని, నష్టం వచ్చిందని అబద్దం చెప్తూ.. 6 లేన్స్ నిర్మాణం చేయటం లేదని ఆయన ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వానికి రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నానని, నితిన్ గడ్కరీ ఇవాళ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై సమీక్ష నిర్వహించారన్నారు. హైవే పై ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎందరో చనిపోతున్నారని, అయినా పట్టించుకోరా అని ఆయన విమర్శించారు. జీఎంఆర్ కాదంటే, కేంద్రమే టెండర్లు వేసి హైవే విస్తరణ చేపట్టాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రి గడ్కరీ జీఎంఆర్ కు వార్నింగ్ ఇచ్చారని, మంగళవారానికి సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.