Komatireddy Venkatareddy: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రే తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. Mla క్వార్టర్స్ లోఏఐసీసీ కార్యదర్శులతో థాక్రే భేటీ కొనసాగుతుంది. కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాక్యలపై చర్చ జరగనుంది. దీంతో..కొత్త ఇంచార్జీ కి కోమటిరెడ్డి ఎపిసోడ్ సవాల్ గా మారింది. కట్టడి చేస్తారా? కఠినంగా వ్యవహరిస్తారా? అనే దానిపై చర్చ కొనసాగనుంది. అయితే కోమటి రెడ్డి వ్యాఖ్యలపై థాక్రే ఏవిధంగా స్పందించనున్నారో అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read also: India Graffiti: కెనడాలో రామాలయంపై భారత వ్యతిరేక గ్రాఫిటీ.. దర్యాప్తు కోరిన ఇండియా
అయితే నిన్న మాణిక్ రావ్ ఠాక్రేతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, రాహుల్ ఏం చెప్పారో తానే చెప్పానన్నారు. ఎవరితోనూ పొత్తు ఉండదని ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో హంగ్ వస్తుందని తాను అనలేదని, తప్పుగా మాట్లాడలేదని, తన మాటలను రాద్ధాంతం చేయవద్దని ఎంపీ కోమటిరెడ్డి వెల్లడించారు. సోషల్ మీడియా సర్వేల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ సీట్లపై చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమని ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అంతకు ముందు మాణిక్ రావ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి ఏం మాట్లాడారో చూడలేదన్నారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని ఠాక్రే అన్నారు. పొత్తులపై వరంగల్ అసెంబ్లీలో రాహుల్ ఏం చెప్పారో అదే ఫైనల్ అని థాకరే స్పష్టం చేశారు.
Inter Practical Exams: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా 3.55 లక్షల మంది..