Inter Practical Exams: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు మార్చి 2 వరకు కొనసాగనుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 3.55 లక్షల మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 2201 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని తెలిపారు. ఇంటర్ బోర్డులో కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, కళాశాల యాజమాన్యానికి ఏమైనా సందేహాలుంటే నేరుగా 040-24600110 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కంట్రోల్ రూం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Read also: Weather Update: నేడు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు.. మండనున్న ఎండలు
ఈ ఏడాది ప్రాక్టికల్ పరీక్షలు ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 100 శాతం సిలబస్ ఆధారంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. రోజుకు రెండు షిఫ్టుల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఏప్రిల్ 20, 22, 25, 27, 29, మే 2 తేదీల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 21, 23, 26, 28, 30, మే 5 తేదీల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో.. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మార్చి 4న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మార్చి 6న నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉండగా.. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారింది. థియరీ పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
TS Police: నేటి నుంచి పోలీసు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు.. 52వేల మంది హాజరు..!