Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుందా..? అంటే నిజమే అని చెప్పుకొస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సామ్ మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే. ఈ పోరాటంలో సమంత గెలుస్తోంది అని అందరు నమ్ముతున్నారు. ఇకపోతే సామ్.. వరుస సినిమాలకు సైన్ చేసి ఉంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు అన్ని షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో సామ్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదట. ఖుషి సినిమాను పూర్తి చేసి సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని తెలుస్తోంది.
ఇక ఈ వ్యాధితో పోరాడుతున్నవారు ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. దీంతో ఆమె సైన్ చేసిన సినిమాల నుంచి తొలగిపోనున్నట్లు తెలుస్తోంది. ఖుషి చివరి అంకానికి చేరుకోవడంతో ఆ సినిమాను మాత్రం పూర్తిచేసి మిగతావాటికి దూరం కానున్నదట. అయితే సామ్ నిర్ణయాన్ని తెలుగు నిర్మాతలు అంగీకరించినా బాలీవుడ్ నిర్మాతలు మాత్రం కుదరదని చెప్పినట్లు సమాచారం. సామ్ వెళ్ళిపోతే తమకు నష్టం వాటిల్లుతుందని ఆమె ఎలాగైనా నటించాలని డిమాండ్ చేస్తున్నారట. మరి సామ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Read Also: Nayanthara: నయనతార క్రేజ్ తగ్గిందా!?