ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 డిసెంబరు 5న భారీ ఎత్తున రిలీజ్ కానుండగా డిసెంబరు 4న రాత్రి 9.30 గంటలకు స్పెషల్ షోస్ తో రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసారు మేకర్స్. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. గత రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై ఎక్స్పెక్టషన్స్ ఇంకా పెరిగాయి. ఓ వైపు సాంగ్స్ మరో వైపు ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి.
Aldo Read : Lukky Bhaskar : నెట్ ఫ్లిక్స్ లో టాప్ -1 లక్కీ భాస్కర్.. వీడియో రిలీజ్ చేసిన దుల్కర్
కాగా అడ్వాన్స్ బుకింగ్స్ లో పుష్ప జోరు ఓ రేంజ్ సాగుతున్నాయి. డిసెంబరు 5న రిలీజ్ నాటికీ బుక్ మై షో బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 1 మిలియన్ టికెట్స్ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది పుష్ప 2. దింతో బుక్ మై షో లో అత్యంత వేగంగా 1 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టిన సినిమాగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. ఈ బుకింగ్స్ రిలీజ్ నాటికి 2 మిలియన్ చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఈ బుకింగ్స్ ను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎంత స్పీడ్ ఉందొ నార్త్ బెల్ట్ లోను అదే జోరు చూపించడం విశేషం. అటు కేరళలోను అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ఒక్క కేరళలోనే ఎర్లీ మార్నింగ్ 4 am షోస్ 100 పైగా ప్రదర్శించేందుకు థియేటర్స్ ను లాక్ చేసి పెట్టారు మల్లు అర్జున్ ఫాన్స్. ఇన్ని అంచనాల మధ్య వస్తున్న పుష్ప ఎన్ని వందల కోట్లు రాబడతాడో రానున్న రోజుల్లో తెలుస్తుంది.