Congress Kisan Cell National Vice President Kodanda Reddy Couter To IT Minister KTR.
మంత్రి కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలపై కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన… కేటీఆర్ నిన్న బిల్డర్ల సమావేశానికి వెళ్లారు. సన్మానాలు శాలువాలు కప్పారు.. ఢిల్లీ తోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల శివారులో భూ సమస్యలు మస్తు వున్నాయి.. అందుకే కేంద్రం రేరా తీసుకొచ్చిందని ఆయన వెల్లడించారు. నిన్న కేటీఆర్ హైదరాబాద్ బాగా డెవలప్ చేసినట్లు మస్తు మాట్లాడిండు.. మాస్టర్ ప్లాన్ 2031 వరకు అమల్లో ఉంటుంది.. కానీ మాస్టర్ ప్లాన్ కు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నారు.. వ్యవస్థలు అన్ని నిర్వీర్యం చేశారు.
కేటీఆర్ శాఖలో అవినీతి బాగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. 46 అంతస్థులకి అనుమతి ఎలా ఇచ్చారు.. 5 అంతస్థులకంటే ఎక్కువ ఇవ్వొద్దు.. మరి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్ అనుకూలమైన వ్యక్తులకే అనుమతులు వస్తున్నాయని, షాట్ సర్క్యూట్ అయితే అంతే.. హైదరాబాద్‌లో చాలా చోట్ల ఫైర్ యాక్సిడెంట్లు అయ్యినప్పుడు పబ్లిక్ ఆగమవుతున్నారన్నారు. ఫైర్ డిపార్ట్ మెంట్ అనుమతులు ఎలా వస్తున్నాయని ఆయన మండిపడ్డారు.