Kishan Reddy: భూమిని కేటాయించండి.. సీఎం కు కేంద్రమంత్రి లేఖ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండం ప్రాంతంలో 100 పడకల ఈఎస్ఐ (ESI) ఆసుపత్రి నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కార్మికుల వైద్య అవసరాలను గుర్తించి, నగరంతో పాటు ..జిల్లాలకు కూడా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరించడానికి కేంద్ర కార్మిక శాఖ ఎన్నో చర్యలు చేపట్టిన విషయం విధితమే. ఈనేపథ్యంలో.. తెలంగాణ ప్రాంతంలో ఎంతో కీలకమైన రామగుండం పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వేలాది ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ 2018 లోనే రామగుండంలో వంద పడకల అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని సంకల్పించింది. ఆమేరకు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ కేంద్ర కార్యాలయం కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ సెప్టెంబర్ 20 2018లో.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.
అనంతరం ESIC ప్రాంతీయ కార్యాలయం పలుమార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని తక్షణమే భూమి కేటాయించాలని ఉత్తరాల ద్వారా కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేకపోవడమే కాకుండా.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ESIC ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల మే నెలలో నిర్వహించిన సమీక్షా సమావేశలో కూడా రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపులో గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న తీవ్ర జాప్యం గురించి చర్చించిన విషయం తెలిసిందే.. కావున భూ కేటాయింపులో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని రామగుండం పరిసర పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న వేలాది కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని.. మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని సత్వరమే రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని కిషన్ రెడ్డి లేఖలో వివరించారు.
Also Read
Nothing Phone 1: నథింగ్ అంటూనే ఫీచర్లతో అదరగొడుతున్నారు.
- Tags
- bjp
- cm kcr
- KishanReddy
- letter
- TRS
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!