Britney Spears officially separated with Sam Asghari: హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అస్గారితో ఆమె అధికారికంగా విడిపోయారు. వీరిద్దరూ విడిపోయిన 8 నెలల తర్వాత విడాకులు మంజూరయ్యాయి. బ్రిట్నీ, సామ్ పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి గురువారం (మే 2) తీర్పునిచ్చారు. మొత్తంగా పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.
బ్రిట్నీ స్పియర్స్, సామ్ అస్గారి జంట గతేడాది జూలైలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరు ఆగస్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరికి లాస్ ఏంజెల్స్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. పెళ్లికి ముందు వీరిద్దరూ దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్‌లో ఉండడం విశేషం. బ్రిట్నీ, అస్గారికి పిల్లలు లేరు. అయితే వివాహంకు ఒక నెల ముందు బ్రిట్నీకి గర్భస్రావం అయింది. వీరిద్దరి మధ్య భవిష్యత్తులో ఏవైనా వివాదాలు ఉంటే.. ప్రైవేట్ ఆర్బిట్రేషన్‌లో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
Also Read: Shahid Kapoor: ప్రేమ పేరుతో నన్ను ఇద్దరు మోసం చేశారు: షాహిద్ కపూర్
పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను 2004లో వివాహం చేసుకున్నారు. ఏడాది తిరిగే సరికే ఈ జంట విడిపోయారు. 2004లో కెవిన్ ఫెడెర్‌లైన్‌తో రెండోసారి వివాహం అయింది. ఈ జంటకు ఇద్దరు కుమారులు. 2007లో ఫెడెర్‌లైన్‌తో బ్రిట్నీ విడిపోయారు. ఇక 2016లో నటుడు సామ్ అస్గారితో డేటింగ్ ప్రారంభించారు. 2021 సెప్టెంబర్‌లో ఈ జంటకు నిశ్చితార్థం అయింది. 2022లో స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అప్పుడే విడిపోయారు.