Telangana: పంచాయతీ కార్మికులకు గుడ్‌న్యూస్.. బీమా సౌకర్యం కల్పించాలని సర్కార్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణ సర్కార్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుధ్య కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పారిశుధ్య కార్మికులు మరణిస్తే వారి అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీల్లో పనిచేస్తూ మరణించిన బహుళార్థసాధక కార్మికులు (ఎంపీడబ్ల్యూ) కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
Read also: Samantha : స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న సమంత..
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ఈ బీమా సౌకర్యాన్ని ఎల్‌ఐసీ అందజేస్తుంది. కార్మికుల బీమా పాలసీ మొత్తాన్ని సంబంధిత గ్రామపంచాయతీ చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి పారిశుధ్య కార్మికునికి ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్వీసులో ఉన్న కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే సర్వీసులో ఉన్న కార్మికులు మరణిస్తే దహన సంస్కారాలకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచారు. ఇప్పటి వరకు తమకు రూ. 5వేలు ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ. 10 వేలు. ఈ మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత గ్రామ పంచాయతీని ఆదేశించింది. ఈ నిర్ణయాల అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న పంచాయతీ కార్మికులు తాజాగా విధుల్లో చేరారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బీమా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Rice Water Health Benefits: గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇక వదలరు..
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు