సైన్స్ సిటీలను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహించాలి: కిషన్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైన్స్ సిటీలను ఏర్పాటు చేసి, తద్వారా యువతలో సైన్స్ సంస్కృతిని ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ పథకం SPoCS కింద హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనను పంపాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక శాస్త్రీయ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయని స్టేట్ ఆఫ్ ఆర్ట్ సైన్స్ మ్యూజియం ఏర్పాటుతో సైన్స్ పైయువతలో ఆసక్తిని పెంపొందుతుందని మంత్రి తెలిపారు.
సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ కేంద్రం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ , సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీ ఎఫ్ ఎస్ ఎల్ ), DNA ఫింగర్‌ప్రింటింగ్ మరియు డయాగ్నోస్టిక్స్ సెంటర్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ లాబొరేటరీ వంటి శాస్త్రీయ సంస్థలు హైదరాబాద్ లో ఉండటం గర్వ కారణమన్నారు. సైన్స్ సిటీ ఏర్పాటుతో వైజ్ఞానిక ఆవిష్కరణలకు మరో హబ్‌గా భవిష్యత్తులో హైదరాబాదును గుర్తించడానికి వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు.
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
సైన్స్‌సిటీల ఏర్పాటుతో యువతలో పరిశోధనాత్మక స్ఫూర్తిని, సృజనాత్మకతతో కూడిన ప్రతిభను పెంపొందించడానికి సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఆస్కారం ఉంటుందని కేంద్రం భావిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, కుటుంబాలు, పర్యాటకులు మరియు సాధారణ ప్రజలకు ఆకర్షణీయంగా మరియు ఉపయోగకరంగా, ప్రదర్శనలో అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలు,సాంకేతికతను ఉపయోగిస్తూ రూపొందించాలని కోరారు.
సైన్స్ సంస్కృతిని ప్రోత్సహించే పథకం (SPoCS) కింద ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని తెలంగాణ సీఎంకు లేఖ రాసినట్టు ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!