Kishan Reddy: గావ్ చలో కార్యక్రమం.. పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేటలో బీజేపీ గావ్ చలో(పల్లెకు పోదాం) అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గావ్ చలో కార్యక్రమంలో భాగంగా అమీర్‌పేటకు చేరుకోవడంతో కేంద్ర మంత్రికి బీజేపీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలతో బీజేపీ రాష్ట్ర చీఫ్ సమావేశమయ్యారు. సరదాగా స్థానిక ప్రజలతో కలిసి నడుస్తు మహిళలు, గ్రామస్తులు, అరుగు బయట కూర్చున్న వారితో మాట్లాడారు. బియ్యం వస్తున్నాయా..? బియ్యం ఎవరిస్తున్నారు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోడీ ఇస్తున్నారని మహిళలు తెలిపారు. ఒక్కొకరికి ఎన్ని కిలోలు వస్తున్నాయని ప్రశ్నించగా.. ఆరు కిలోలు వస్తున్నాయని సంతోషంగా తెలిపారు. మోదీ పంట పెట్టుబడి పైసలు వస్తున్నాయా అని ఆరా తీసారు. వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. మోడీ పైసలు రాకపోతే స్థానిక బీజేపీ నాయకులను కలిసి తహసీల్దార్ దగ్గరికి వెళ్తే మోదీ పైసలు వస్తాయని సూచించారు.
Read also: Sugar Patients: షుగర్ పేషంట్స్ కు తీపికబురు.. ఆ చాక్లేట్స్ తో షుగర్ కంట్రోల్..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
సమావేశం అనంతరం డ్వాక్రా మహిళా సంఘాలు, రైతు సదస్సు, ఎస్సీ కాలనీ సందర్శన, దళితులతో సమావేశం, అయ్యప్పస్వాములు, ఉద్యోగులు, యువత, క్రీడాకారులతో వేరు వేరుగా సమావేశంకానున్నారు. దేశ వ్యాప్తంగా 24గంటల పాటు గ్రామాల్లో ఉండాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా సహా అందరూ గ్రామాలను సందర్శిస్తున్నారని తెలిపారు. రైతులు, మహిళలు, రైతు కూలీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశం అవుతున్నామన్నారు. గ్రామంలోని రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కార్యక్రమం లక్ష్యమన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో పల్లెకు పోదాం.. అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి, మహిళా సాధికారత, శాంతి భద్రతల కోసం దేశంలోని ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జాతీయ రహదారులతో దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వం అనుసంధానం చేసిందన్నారు.
Read also: Sugar Patients: షుగర్ పేషంట్స్ కు తీపికబురు.. ఆ చాక్లేట్స్ తో షుగర్ కంట్రోల్..
స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 2014వరకు తెలంగాణలో 2400కిలో మీటర్లు జాతీయ రహదారి ఉండేది.. మోదీ వచ్చాక 5 వేల కిలో మీటర్లు దాటిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాను విజయపథంలో నడిపించాలని తెలిపారు. నరేంద్ర మోదీ పార్లమెంట్లో అద్భుతంగా ప్రతిపక్షాల నోరు మూపించారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని భూ ప్రపంచంలో అవినీతి చేసిందని ఎవరూ అనలేరని తెలిపారు. నరేంద్ర మోదీకీ ఎన్ని ఓట్లు, సీట్లు వస్తాయని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపైన దేశ ప్రజలకు విశ్వాసం లేదన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో 25 మందిని కొత్త వారిని చేర్పించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంటింటికీ తిరగాలి పార్టీలోకి ఆహ్వానించాలన్నారు. పోలింగ్ బూత్ కమిటీలు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ నమో యాప్ చూడాలి.. నమో యాప్ లో అన్ని అంశాలు పొందుపరిచామన్నారు.
Read also: Congress- Modi Speech: లోక్ సభలో ప్రధాని మోడీ స్పీచ్ పై కాంగ్రెస్ ఆగ్రహం..
తొమ్మిదిన్నర ఏళ్లలో నిత్యావసర ధరలను తగ్గించగలిగామన్నారు. నిత్యావసర ధరలపైన ప్రతిపక్షాలు ప్రశ్నించింది లేదని తెలిపారు. ఇతర పార్టీల్లో యాక్టివ్ గా లేని వాళ్ళను పార్టీలో చేర్చుకోవాలన్నారు. కమ్యునిజం కనుమరుగైంది.. తెలంగాణ పేరు తొలగించిన రోజే కేసీఆర్ పార్టీ ఖతమైందన్నారు. భాజపాకు కనుచూపు మేరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. పోలింగ్ బూత్ లో వంద ఓట్లు పోలైతే.. 51 ఓట్లు భాజపాకు రావాలన్నారు. 70 శాతం ఓట్లు తెచ్చిన బూత్ నాయకులను సన్మానిస్తా అన్నారు. ముస్లిం మహిళల ఓట్లను కూడగట్టుకొని మెజార్టీ తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలను వంట ఇంటి కుందెల్లుగా, పిల్లలను కనే యంత్రాలుగా తయారు చేస్తుందన్నారు. అమీర్ పేట గ్రామంలోనే ఈ రాత్రి బస చేయనున్నారు. రేపు ఉదయం గ్రామ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం గావ్ చలో అభియాన్ కార్యక్రమం ముగియనుంది.
Minister Botsa: డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక భేటీ
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!