Komatireddy Raj Gopal Reddy: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చేస్తోంది. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తి కాగా.. ఐదో రౌండ్‌లో టీఆర్ఎస్ 6162, బీజేపీ 5245.. టీఆర్ఎస్ లీడ్ 917, ఐదు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 32,405, బీజేపీ 30,975, కాంగ్రెస్ 10,055, బీఎస్పీ 1,237.. టీఆర్‌ఎస్ 1430 ఓట్లు ఆధిక్యంలో ఉంది. ఈనేపథ్యంలో.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అంతిమ విజయం మనదే అన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాలుగు రౌండ్ లు అయిపోయే సరికి ఎలక్షన్ చాలా టైట్ గా నడించిందని అన్నారు. ప్రజలు మాతోటి ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.కేసీఆర్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వచ్చిన ఎన్నిక ఇది అని తెలిపారు. మునుగోడు ప్రజలు మంచి తీర్పు ఇస్తారని నమ్మకం ఉందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అన్ని మండలాల్లో కూడా మంచి తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. అంతకు ముందే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదని సహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫలితం ఎలానైనా ఉండొచ్చన్నారు.
Read also: Munugode By Election Results: ఈసీపై బీజేపీ సీరియస్.. మునుగోడు ఫలితాలపై అనుమానం
చివరికి వరకు హోరా హోరీ తప్పకపోవచ్చని ఆయన అన్నారు. ఇప్పటివరకైతే టీఆరెఎస్ ఆధిక్యంలో ఉందని అన్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని తెలిపారు.బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నాలుగు రౌండ్ లు అయిపోయే సరికి టీఆర్‌ఎస్ ముందంజలో ఉందని అన్నారు. చౌటుప్పల్ రూరల్ నారాయణ్ పూర్ గ్రామంలో బీజేపీ మెజార్టీ వస్తుందని నమ్మకం ఉండేదని అన్నారు. 4 రౌండ్లలో టీఆర్ ఎస్ మెజార్టీ వున్నా ఇంకా 11 రౌండ్లు వున్నాయని అన్నారు. తప్పకుండా ఇది హోరా హోరీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మునుగోడు ప్రజల కోసం వేచి చూడాల్సిందే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
29Years Back KTR Bike: 29 ఏళ్ల క్రితం కేటీఆర్ కాలేజీకి ఏ బైక్ పై వెళ్లే వారో తెలుసా !