టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లు అరవింద్ కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థకు చెందిన బన్నీ వాసు వెల్లడించారు. అసలు విషయం ఏమిటంటే చావా అనే సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా అందులో ఈ సినిమాని రిలీజ్ చేస్తాను అన్నప్పుడు అల్లు అరవింద్ రియాక్షన్ ఏమిటి అని ప్రశ్నించారు. అయితే నిజానికి ఆయన కేరళ ట్రీట్మెంట్ కోసం వెళ్లారని ఈ సందర్భంగా బన్ న్యూస్ చెప్పుకొచ్చారు. ట్రీట్మెంట్ అంటే మీరు ఏదో అనుకుంటారు కాదు అది వెల్ నెస్ సెంటర్.
Posani Krishnamurali: నరసరావు పేట పోలీస్ స్టేషన్ కు పోసాని!
మామూలుగా బరువు తగ్గడానికి వెళ్లే లాంటి సెంటర్ అది అని చెప్పుకొచ్చారు. ప్రకృతి వైద్యం నిమిత్తం ఆయన అక్కడికి వెళ్లినట్లుగా ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. హిందీ నిర్మాతలతో మాట్లాడి తెలుగు వర్షన్ తీసుకొచ్చే విషయంలో చొరవ తీసుకోవాలని అక్కడికి వెళ్లిన అల్లు అరవింద్ సూచించారని ఆయన సూచనలతోనే ముందుకు వెళ్లి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని బన్నీ వాసు అన్నారు. ఇక హిందీ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.