KCR: నేడు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల పైనా నాయకులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్. నిన్న వరంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం వరంగల్ ముఖ్యనేతలతో పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్ధేశం చేయనున్నారు.
Read also: Lok Sabha Elections 2024: ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఈసీ..
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిన్న (ఆదివారం) వరంగల్ జిల్లాలో బస్సుయాత్ర చేపట్టి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా గొప్పతనాన్ని కొనియాడారు. వరంగల్ నేలతో, చరిత్రతో తనకు విడదీయరాని బంధం ఉందన్నారు. 42 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అన్నదమ్ములకు నమస్కారాలు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.
Read also: RCB vs GT: ఆల్‌టైమ్ రికార్డ్.. 10 బంతుల్లోనే 50 రన్స్!
హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ చురుగ్గా ఉండే వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఆయన మీ ఆశీస్సులతో పార్లమెంటులో అడుగుపెట్టాలన్నారు. తెలంగాణ చరిత్ర వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా. నాడు ఉద్యమ కాలంలో ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే తెలంగాణ వచ్చింది. ఈ నేలతో, ఈ చరిత్రతో నాకు విడదీయరాని బంధం ఉంది. 1969 నుంచి అలుపెరగని పోరాటం చేసిన మన కాళోజీ, మన జయశంకర్ సార్‌లను కలిసినప్పుడు భావోద్వేగానికి లోనవుతున్నామని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
Flaxseeds Benefits : అవిసె గింజలను ఇలా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు..