RCB vs GT: ఆల్‌టైమ్ రికార్డ్.. 10 బంతుల్లోనే 50 రన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will Jacks Took 10 Balls only To Hit 50 to 100 in IPL: ఐపీఎల్ 2024లో విదేశీ యువ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ మెరుపు ఇన్నింగ్స్ ఆది అందరిని ఆకర్షించాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఫ్రేజర్.. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్ అన్నట్లు అతడి ఇన్నింగ్స్ సాగింది. తాజాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ రెచ్చిపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న జాక్స్.. గుజరాత్ టైటాన్స్‌పై విధ్వంసక శతకంతో ఆకట్టుకున్నాడు.
నిజానికి ఈ మ్యాచ్‌లో విల్ జాక్స్ తొలుత 16 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. కాస్త స్పీడ్ పెంచిన అతడు అర్ధ శతకాన్ని 31 బంతుల్లో పూర్తి చేశాడు. ఆపై జాక్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 41 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అంటే 10 బంతుల్లో 50 నుంచి 100 స్కోరుకు చేరుకున్నాడు. దాంతో ఐపీఎల్‌లో 50 నుంచి 100 పరుగులను అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా జాక్స్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ హాఫ్ సెంచరీని సెంచరీగా మలచడానికి 13 బంతులు తీసుకున్నాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Also Read: Virat Kohli: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్‌లో వేగవంతమై సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో విల్ జాక్స్ అయిదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ టాప్‌లో ఉన్నాడు. గేల్ 30 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్ (37), డేవిడ్ మిల్లర్ (38), ట్రావిస్ హెడ్ (39), జాక్స్ (41) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. హెడ్, జాక్స్ ఐపీఎల్ 2024లో శతకాలు చేశారు.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!