Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్ 5లోని ‘హోటల్ OSLN టెర్మినస్’ ఓయో గదిలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆమె ప్రియుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని విశాఖపట్నంకు చెందిన షారన్ నిఖిత టోప్నోగా పోలీసులు గుర్తించారు. ఆమె తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి నిన్న మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. అనంతరం OYO యాప్ ద్వారా సదరు హోటల్లోని రూమ్ నంబర్ 303లో ఇద్దరూ అద్దెకు దిగారు.
అయితే తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో కొండాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మహిళ మృతి చెందినట్లు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. షారన్ నిఖితను అత్యవసర చికిత్స నిమిత్తం ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ హోటల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రికి తీసుకువచ్చాడని, అయితే ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా, మృతురాలి ముఖం, తలపై తీవ్రమైన గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో యువతి మృతి చెందినట్లు తెలియగానే ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ ఆసుపత్రి సిబ్బంది కంటపడకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు హోటల్ రూమ్ నంబర్ 303ను పరిశీలించగా, గదిలోని గోడలపై, బెడ్‌షీట్‌పై అనుమానాస్పద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాస రవి తేజ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Also Read
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
తాజావార్తలు
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!