Chevella Tragedy: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ (ఖానాపూర్ స్టేజీ) సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ హైవేపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 20 మంది ప్రాణాలను కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంగ్ రూట్‌లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం తీవ్రతకు…
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు ప్రాంతాల నుంచి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్).. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్)గా మారిపోయింది… తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం.. ప్రతినిధులు దానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. ఇక, ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని.. సమావేశం చివరల్లో చదివి వినిపించారు గులాబీ పార్టీ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు.. భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీ 2022న…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఆకస్మిక మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. బొజ్జల మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓమంచి సహచరుడిని , ఆత్మీయుడిని కోల్పోయానంటూ సదరు ప్రకటనలో పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు కీలక…
తెలంగాణలో నిరుద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఉద్యోగాల ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో సంబురాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ్యాన్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు మార్చి9 వ తేదీ అన్నారు దానం. నిరుద్యోగులను కాంగ్రెస్, బీజేపీలు ఉసిగొల్పాయి. సీఎం కేసీఆర్…