KCR Should Win As Hat Trick CM Says Minister Malla Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ నీళ్లు, కరెంట్ ఇవ్వలేదని విమర్శించారు. ప్రధాని మోడీ దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కానీ.. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ పాలనే కోరుకుంటోందన్నారు. ఆర్నెళ్లలో మేము వస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయని.. అసలు వారికి ఓటు అడిగే హక్కు లేదని తేల్చి చెప్పారు.
Minister KTR: డబుల్ మెజారిటీతో గెలిపించి, వాళ్లు బుద్ధి చెప్పండి.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం
దేశంలోనే దేశంలో ఆదర్శంగా నిలుస్తోందని.. మంత్రి కేటీఆర్ ఇతర దేశాలకు వెళ్లి, భారీగా పరిశ్రమలకు పెట్టుబడులు తీసుకొస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ప్రశంసించారు. అమెరికా తర్వాత కార్పొరేట్ ఆఫీసులకు హైదరాబాద్ హెడ్ క్వార్టర్‌గా మారిందన్నారు. కేటీఆర్ వల్లే రాష్ట్రానికి విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయన్న ఆయన.. కమాండ్ కంట్రోలర్ ఆఫీసును అమెరికా, ఇంగ్లండ్, సింగపూర్ తర్వాత హైదరాబాద్‌లోనే నిర్మించామని అన్నారు. హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు జాగాలేదని, రెండో ఎయిర్‌పోర్టు పాలమూరులోనే కట్టాల్సి వస్తుందని అన్నారు. 9 ఏళ్ల క్రితం పాలమూరులో నీళ్లు, కరెంటు, రోడ్లు లేవని.. కానీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేశారని చెప్పుకొచ్చారు.
MLA Seethakka: కేటీఆర్ ఆ మాటను బేషరతుగా వెనక్కు తీసుకోవాలి.. సీతక్క డిమాండ్
ఇదే సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను ఉపాధి దొరికే జిల్లాగా మార్చామన్నారు. ప్రతిపక్ష పార్టీలు పగటి కలలు కంటున్నాయని సెటైర్లు వేశారు. మూడు గంటల కరెంట్, 200 ఫించన్ ఇవ్వడానికి మళ్ళీ మేమోస్తాని అంటున్నాయన్నారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారని.. ప్రజలు తెలివితో ఆలోచించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్లలో 2000 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, గ్రామాల్లో 1150, మున్సిపాలిటీలో 850 ఇళ్లను నిర్మించుకున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.