KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు
- “చిల్లర ప్రభుత్వం” అంటూ ఘాటు వ్యాఖ్యలు
- పార్లమెంట్లో బీఆర్ఎస్ లేకపోవడంపై ఆవేదన
- రైతులు, అంబేద్కర్ విగ్రహం అంశాలపై ఆగ్రహం
KCR : తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ (BRS) ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును చూస్తుంటే రాష్ట్రం ‘బొందలో పడ్డట్టు’ అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు వాడుతున్న భాషను తప్పుబడుతూ, ఇది ఒక “చిల్లర ప్రభుత్వం” అని ఆయన సంబోధించారు.
పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఒక్కరు కూడా అడ్డుకోలేదని మండిపడ్డారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే సభలో రణరంగం సృష్టించేవాళ్లమని, తెలంగాణ హక్కుల కోసం గట్టిగా పోరాడేవాళ్లమని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి మరే పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
- Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. పక్క రాష్ట్రాల ప్రజలు విగ్రహాన్ని చూడటానికి వస్తుంటే గేట్లు కూడా తీయకుండా అవమానించారని, తాము పోరాటం చేసిన తర్వాతే గేట్లు తెరుచుకున్నాయని ఆరోపించారు. ఇక రైతుల పరిస్థితిపై స్పందిస్తూ.. ధాన్యం కొనడం చేతకాక రైతులను గోస పెడుతున్నారని, రైతు బంధు వంటి గొప్ప పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో తాను పడ్డ కష్టాలను కేసీఆర్ ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు ప్రతిపాదించినా తాను ఒప్పుకోలేదని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కోసమే పట్టుబట్టి సాధించానని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించినట్లు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం కోసం తాము పడిన కష్టాన్ని మర్చిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, వారి కూతలకు భయపడేది లేదని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!