Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు నాకు మోరల్ విక్టరీ
- ఇంకా ఈడీ కేసు ఉందని బీజేపీ వాళ్ళు అంటున్నారు
- ఎలాంటి ఆధారాలు లేవని జడ్జి తీర్పు ఇవ్వడం నైతిక విజయం
- నాకు ప్రకృతి సహకరిస్తుంది
- నన్ను ఐదున్నర నెలలు జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారు : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు తన పాలిట నైతిక విజయమని (Moral Victory) ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఐదున్నర నెలల పాటు జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని స్వయంగా జడ్జి తీర్పు ఇవ్వడం ద్వారా కేంద్రం పెట్టినవి తప్పుడు కేసులని ప్రజలకు అర్థమైందని అన్నారు. ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేయమని కోర్టు అనడం అంటేనే ఈ కేసులో దర్యాప్తు సంస్థల వద్ద ఏమీ లేదని తేలిపోయిందని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కవిత తన సొంత పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఇప్పుడు నీతులు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు, నేను అరెస్టు అయినప్పుడు ఎక్కడికి వెళ్లారు?” అని ఆమె నిలదీశారు. తనకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరూ తెలియదని, ఎంపీగా ఉన్న కారణంగా కేవలం సంజయ్ సింగ్‌తో మాత్రమే పరిచయం ఉండేదని వివరించారు. దర్యాప్తుకు తాను ఎప్పుడూ సహకరించానని, తన దగ్గర ఉన్న ఫోన్లన్నీ ఈడీకి ఇచ్చి ఆధారాలు ఉంటే చూసుకోమని చెప్పానని గుర్తు చేశారు.
Also Read
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
సమాజం పట్ల మావోయిస్టు అగ్ర నేతలకు తన కంటే లక్ష రెట్లు ఎక్కువ అవగాహన ఉందని కవిత వ్యాఖ్యానించారు. “నేను బయట ఉండి పోరాటం చేస్తే, వారు అడవుల్లో ఉండి సమాజం కోసం ఫైట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు లొంగిపోయి మావోయిస్టు సిద్ధాంతాన్ని బతికించారు” అని ఆమె పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మాజీ మావోయిస్టులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని ఆమె విమర్శించారు. ఇదే క్రమంలో, తాను సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాల్లో చాలా ‘సర్‌ప్రైజ్‌లు’ ఉంటాయని హింట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కుమ్మేర ఘటన బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. తాను సమస్యలు ఉన్న దగ్గర షో చేయడానికి వెళ్ళనని, ఘటన జరిగిన రోజునే ఎస్పీతో మాట్లాడానని స్పష్టం చేశారు. అలాగే గాంధీ సరోవర్ కింద గాంధీ విగ్రహం కట్టడాన్ని తప్పు పట్టనని, అయితే ఆ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రకృతి తనకు సహకరిస్తోందని, నిజం నిలకడగా తెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Ayesha Meera case: ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించిన సీబీఐ
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!