Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ వేడుకోలు..
- అంతర్జాతీయ సాయాన్ని అభ్యర్థిస్తు్న్న దాయాది దేశం..
- పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒప్పందాన్ని నిలిపేసిన భారత్..
- ‘‘రక్తం-నీరు కలిసి ప్రవహించలేవు’’ అనేది భారత్ వైఖరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని(Indus Waters Treaty–IWT) నిలిపేయడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ‘‘రక్తం-నీరు కలిసి ప్రవహించలేవు’’ అనే వైఖరిపై భారత్ స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపేసేదాకా ఈ ఒప్పందాన్ని నిలుపు చేస్తామని భారత్ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. సింధు జలాల విషయంలో వేడుకుంటోంది.
అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన వర్చువల్ సెమినార్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1960 నాటి ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం వల్ల తమ దేశ నీటి భద్రత ప్రభావితమవుతోందని అన్నారు. ఇది పాక్ స్థిరత్వంతో ముడిపడి ఉన్న అంశమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణాసియాలో విస్తృత పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. భారత్ 2025 ఏప్రిల్‌లో ఈ ఒప్పందాన్ని నిలిపేయడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని అన్నారు.
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు, సహకారం అవసరమని, ఒప్పందం పునరుద్ధరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇషాక్ దార్ హెచ్చరించారు. సింధు నదీ పరివాహక ప్రాంతం పాకిస్థాన్‌లోని 25 కోట్ల మందికి పైగా ప్రజలకు జీవనాడి వంటిదని చెప్పారు. వ్యవసాయం, ఆహార భద్రత, విద్యుత్ ఉత్పత్తి, ఉపాధి, జీవనోపాధి, ఆర్థికాభివృద్ధి వంటి అనేక రంగాలు సింధు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉన్నాయని వివరించారు.
ప్రపంచంలో వాతావరణ మార్పుల ప్రభావానికి గురవుతున్న, అత్యంత నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటని చెప్పారు. తలసరి నీటి లభ్యత తగ్గడం, వర్షపాత విధానాల్లో మార్పులు, హిమానీనదాలు కరిగిపోవడం, వరదలు, కరువులు, నీటి ప్రవాహాల్లో పెరుగుతున్న అనిశ్చితి వంటి అంశాలు పాకిస్థాన్‌కు సవాళ్లుగా మారుతున్నాయని అన్నారు. సింధు జలాల ఒప్పందం ద్వారా తమకు కేటాయించిన నీటిని దూరం చేసే ఏ ప్రయత్నమైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
తాజావార్తలు
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!