FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FSSAI: ప్రముఖ మసాలా బ్రాండ్లు ఎవరెస్ట్, లాల్జీ గోధూ సంస్థలకు చెందిన ఇంగువ (అసాఫోటిడా) అమ్మకాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాత్కాలికంగా నిషేధం విధించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అలర్ట్ అయిన ఆహార భద్రతా అధికారులు.. ముంబైలోని ఈ రెండు కంపెనీల తయారీ కేంద్రాలతో పాటు గుజరాత్‌లోని ఉంబర్‌గావ్‌లో ఉన్న ఎవరెస్ట్ యూనిట్ నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఈ నాణ్యతా పరీక్షల్లో ఇరు కంపెనీల ఇంగువ ఉత్పత్తులు తీవ్ర ప్రమాణాల లోపంతో ఉన్నట్లు తేలింది.
FSSAI నిబంధనల ప్రకారం.. కాంపౌండెడ్ ఇంగువలో కనీసం 5 శాతం ఆల్కహాల్-సోల్యుబుల్ ఎక్స్ట్రాక్ట్ ఉండాలి. కానీ, పరీక్షించిన శాంపిళ్లలో ఇది కేవలం 0 నుంచి 3 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. అంటే, ఈ కంపెనీలు చట్టబద్ధంగా వాడాల్సిన పరిమాణం కంటే 30 నుంచి 40 శాతం తక్కువగా ముడి ఇంగువను ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా లాల్జీ గోధూ యూనిట్లో సేకరించిన ఆరు రకాల ముడి ఇంగువలో స్టార్చ్ శాతం ఏకంగా 15 నుంచి 32 శాతం వరకు ఉన్నట్లు బయటపడింది. నిబంధనల ప్రకారం ఇది గరిష్టంగా 1 శాతం మాత్రమే ఉండాలి. దీంతో నాణ్యతా ప్రమాణాలు పాటించనందుకు ఈ ఉత్పత్తులపై FSSAI చర్యలకు దిగింది.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ఇదే సమయంలో ఎవరెస్ట్ సంస్థకు చెందిన ఎగ్ కర్రీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలాలలో కూడా నియమ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు FSSAI గుర్తించింది. అయితే, ప్రస్తుతానికి ఈ మూడు మసాలా ఉత్పత్తులపై ఎలాంటి నిషేధం విధించలేదు. నిబంధనలు ఉల్లంఘించడంపై వివరణ ఇవ్వాలని, తిరిగి నిర్దేశిత ప్రమాణాలు అందుకునేందుకు తీసుకునే చర్యలపై కార్యాచరణ నివేదిక సమర్పించాలని FSSAI రెండు కంపెనీలను ఆదేశించింది. అలాగే మార్కెట్లో ఉన్న సబ్‌స్టాండర్డ్ ఉత్పత్తులను కంపెనీలే స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని సూచించింది. నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు లేదా సాచురేటెడ్ ఫ్యాట్ పరిమితికి మించి ఉంటే, ప్యాకెట్ ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా ముదురు ఎరుపు రంగు Hexagonal హెచ్చరిక లేబుల్‌ను తప్పనిసరి చేయాలని FSSAI ప్రతిపాదించింది.
తాజావార్తలు
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు