MLC Kavitha : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వాస్తు భయంతో సచివాలయానికి రావడం లేదని, కానీ మీడియా ముందు సవాళ్లు విసురుతూ హద్దులు మీరుతున్నారని వ్యాఖ్యానించారు.
కవిత మాట్లాడుతూ.. బీసీలకు మద్దతుగా 22వ తేదీన రైలు రోకో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీలపై ప్రభుత్వం చేస్తున్న సర్వే న్యాయబద్ధంగా లేదని, గతంలో కెసిఆర్ చేసిన బిసి సర్వేలో 52 శాతం వచ్చినా.. ఇప్పుడిదే ప్రభుత్వం సర్వే చేస్తే 46 శాతం మాత్రమే చూపించడం అనుమానాస్పదమన్నారు. కొత్తగూడెం సిపిఐ పార్టీ బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని గుర్తు చేస్తూ.. ఇలాంటి పార్టీలు అవసరమా అనే దానిపై బిసి యువత ఆలోచించాలన్నారు.
Canada: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, భారతీయ విద్యార్థి మృతి.
కవిత ఆరోపించిన మరో ప్రధాన అంశం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారైనా “జై తెలంగాణ” అన్నారా అని ప్రశ్నించారు. కోట్లాది ప్రజల పోరాటంతో ఏర్పడిన తెలంగాణను ఈ ప్రభుత్వం అంగమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులు అడగకుండానే సంక్షేమ పథకాలు ఇచ్చినవారు కెసిఆర్ మాత్రమేనన్నారు.ప్రస్తుతం రైతులకు విత్తనాలు, పురుగు మందులు లభ్యం కాకుండా పోయిందని, ప్రభుత్వ నిర్వాహక లోపాన్ని ఎండగట్టారు. రేవంత్ రెడ్డి బీసీలకు మద్దతుగా మాట్లాడితే ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్తగూడెం పరిశ్రమల జిల్లా అయినప్పటికీ.. అధిక కాలుష్యం సమస్యగా మారిందని, దాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. ఇక్కడ మూడు మంది మంత్రులు ఉన్నా విమానాశ్రయం రాలేదని, జాగృతి ఆధ్వర్యంలో విమానాశ్రయ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయిన ఐదు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తామన్నారు. రాములవారి భూములపై జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. అవసరమైతే ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానన్నారు.
Sanju Samson: కేకేఆర్లోకి సంజూ శాంసన్.. హింట్ ఇచ్చిన స్కౌటింగ్ హెడ్!
