Huge fire in gunny bags godown: కరీంనగర్ జిల్లా బైపాస్ రోడ్డు సమీపంలోని రజ్వీ చమాన్ వద్ద గన్నీ సంచుల గోడౌన్ లో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను స్థానిక సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో పాటు మున్సిపల్ వాటర్ ట్యాంకర్లతో మంటలార్పే ప్రయత్నాలు చేపట్టారు. కొన్ని గంటల తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అక్కడున్న వారు ఊపిరిపీల్చుకున్నారు.
Read also: Anakapalle: ప్రేమ పేరుతో వేధింపులు.. కోడికత్తితో యువతిపై యువకుడు దాడి
ఈఘటనలో 15 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు గూడౌన్ నిర్వాహకులు తెలిపారు. అయితే గోడౌన్ లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు చెబతున్నారు. గోడౌన్ లో సుమారు 15లక్షల ఆస్తి నష్టం జరగిందని అంటున్నారు. ఇలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం టెక్స్ టైల్ పార్క్ సమీపంలోని పౌర సరఫరా శాఖ గోడౌన్ లో ప్రమాదం జరిగిన ఘటన మరువక ముందే మళ్లీ కరీంనగర్ లో చోటుచేసుకోవడం గూడౌన్ నిర్వాహకులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Corona Virus: వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం