Law College: కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీ (న్యాయ కళాశాల) మంజూరు కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. లా కాలేజీ అనుమతికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. 120 మంది విద్యార్థులతో (రెండు సెక్షన్లు) ఎల్ఎల్ బీ కోర్సు ప్రారంభం కానుంది. అయితే, శాతవాహన వర్శిటీలో లా కళాశాల మంజూరు చేయాలని కోరుతూ వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ గతంలో బండి సంజయ్ ను కోరారు. ఈ నేపథ్యంలో గత నెల మొదటి వారంలో వీసీ ఉమేశ్, మాజీ మేయర్ సునీల్ రావును వెంటబెట్టుకుని ఢిల్లీలోని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కలిసి లా కాలేజీని మంజూరు చేయాలని బండి సంజయ్ కోరారు.
Read Also: Virat Kohli: టెస్ట్ క్రికెట్లో ముగిసిన రోకో శకం.. టీమిండియాను నడిపించే నాయకుడెవరు?
అయితే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై వర్చువల్ గా శాతవాహన వర్శిటీని తనిఖీ చేయడంతో పాటు వివరణలతో కూడిన నివేదిక కోరినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ కు విషయాన్ని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గుర్తు చేశారు. బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు వివరణాత్మక నివేదికను పంపినట్లు పేర్కొన్నారు. బండి సంజయ్ వినతికి సానుకూలంగా స్పందించిన అర్జున్ మేఘ్వాల్ అతి త్వరలోనే శాతవాహన వర్శిటీకి అనుబంధంగా లా కాలేజీకి అనుమతి ఇవ్వడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సు ప్రారంభమైతుందని హామీ ఇచ్చారు. ఇక, న్యాయశాఖ మంత్రి ఇచ్చిన మాట ప్రకారం లా కాలేజీ అనుమతికి రావడంతో.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ తో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కేంద్రమంత్రి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.