IND vs USA: టీమిండియా ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. స్టార్ బౌలర్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs USA: నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 మొదలయ్యింది. అయితే భారత్ మ్యాచ్ ప్రారంభానికి ముందే టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఇప్పటికే మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకోగా, ఇప్పుడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశమున్నట్లు సమాచారం.
T20 World Cup Records: వరల్డ్‌కప్‌లో విజయవంతమైన ఛేజ్.. ఎలైట్ లిస్ట్‌లో పాకిస్థాన్‌కు చోటు!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
నేడు (ఫిబ్రవరి 7) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా జట్ల మధ్య గ్రూప్-A తొలి మ్యాచ్ జరగనుంది. అయితే బుమ్రా అకస్మాత్తుగా వైరల్ జ్వరానికి గురైనందున ఈ మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 6న ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చినప్పటికీ బుమ్రా ఎలాంటి శిక్షణలో పాల్గొనలేదని సమాచారం. టోర్నమెంట్ మొత్తం దృష్టిలో పెట్టుకుని కీలక బౌలర్ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ మ్యాచ్ సమయానికి బుమ్రా అందుబాటులో లేకపోతే.. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పై పడనున్నాయి. హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో సిరాజ్‌ను జట్టులోకి చేర్చారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మూడో పేసర్‌గా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో పునరావాసం పొందుతున్నాడు. అతను త్వరలో జట్టులో చేరుతాడని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!