Law College: కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీ (న్యాయ కళాశాల) మంజూరు కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. లా కాలేజీ అనుమతికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.