తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Law College: కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీ (న్యాయ కళాశాల) మంజూరు కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. లా కాలేజీ అనుమతికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మెనేజ్మెంట్ కళాశాల కామర్స్ ప్రొపెసర్ జాస్తి రవి కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం వీసీ ప్రొ. ఉమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొపెసర్ రవి కుమార్ ప్రస్తుతం ఓయూ జిల్లా పీజీ కేంద్రాల డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా, యుఎఫ్ఆర్ఓ డెరైక్టర్‌గా, సీడీఈ జాయింట్ డెరైక్టర్‌గా, పరీక్షల విభాగం ఆడిషినల్ కంట్రోలర్‌గా, సెంటినరి ఉత్సవాల కోఆర్డినేటర్‌గా బాధ్యతలు…
తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం ఫైల్‌పై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం. కుమార్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్ కుమార్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, వ్యవసాయ…
కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ పై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఫిజిక్స్ పేపర్ లీకేజీ ఘటన, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై సీరియస్ అయ్యింది. ఎస్ యూ పరీక్షల విభాగం అధికారులను వివరణ కోరారు ఛైర్మెన్ పాపిరెడ్డి. సెల్ ఫోన్ ఆధారంగా లికేజీకి పాల్పడ్డ వారిని గుర్తించినట్లు సమాచారం. దాంతో ప్రభుత్వ ప్రవేటు కళాశాలల నిర్వహకుల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే ఓ ప్రవేటు కాలేజీకి చెందిన విద్యార్థులు సెల్ ఫోన్ చూస్తూ ప్రశ్నలకు జవాబులు…