Bandi Sanjay: జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకుంటారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్ జర్నలిస్టులకు మంజూరు చేసిన ఇండ్ల పట్టాలను రద్దు చేయడం పై ఆయన మండిపడ్డారు. జర్నలిస్టులు పడుతున్న కష్టాలపై లేఖలో పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ముందర కరీంనగర్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీ ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమైన విషయం. అన్ని పథకాల్లో మహిళలలే మీరు ప్రాధాన్యత `ఇస్తానని.. ‘మహాలక్ష్మి’ పథకం అందిస్తానని… ఇంటి యజమానురాలుగా మహిళనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. సీఎం సోడాలో మీరు, మీ మంత్రివర్గ సహచరులు సైతం ఇదే విషయాన్ని పదేపదే చెప్పారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణలో అతి పెద్ద పండుగైన విజయదశమి ముందర మహా ఇష్టమైన బతుకమ్మ పండుగ ముంగిట జర్నలిస్టు కుటుంబ సభ్యులైన మహిళల పేరిట ఇచ్చిన ఇంద్ర స్థలాలను రద్దు వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం ఎంతవరకు సమంజసం?
కరీంనగర్ లోని 118 జర్నలిస్టులకు వారి భార్యల పేరిటి సగటు 2023 అక్టోబర్ 7వ తేదీన ప్రొసీడింగ్ నెంబర్. LOOKNR/2BHK/9/2021/8 మితకుంట వద్ద పట్టాల తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హులను ఎంపిక చేసామని పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చారు. జర్నలిస్టులందరికి వారి సతీమణిల పేరిట ఈ పట్టాలను గత బతుకమ్మ పండుగ ముందర అందించారు. తర్వాత మీ ప్రభుత్వం రాగానే.. అందులో కొండదు అనర్హులు ఉన్నారంటూ… మీ ప్రభుత్వంలోని కొందరి ఆదేశాలు మేరకు వివాదం చేపట్టారు. చేతికి అందిన పట్టాలు చూస్తూ ఇన్నాళ్లు మురిసిన కటాయించిన స్థలాల్లోకి వెళ్లే అవకాశం ఇస్తారని ఆశతో ఎదురు చూశారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
వివాదం తర్వాత.. అవర్డులను తీని అర్హులైన వారికి ఇస్తారని ఎదురు చూశారు. కానీ” అన్యాయంగా. దాపు కణుడు చల్లగా చెయెప్పినట్టు గతంలో ఇప్పుడని రద్దు అయ్యాయని ఇప్పుడు అధికారులు చెప్పుకునం నోటి కా అడపడుచు. కన్నీళ్లు పెట్టే పరిస్థితి ముందిం చారు. వారంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఏందనేది మీకు తెలుసు. వారి ఆర్థిక పరిస్థితి అంతం మాత్రమేనని, అత్యధిక మంది జర్నలిస్టులు నేటికీ కిరాయి ఇండ్లలోనే జీవనం సాగిస్తున్న విషయం విదితమే అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని గతంలోనూ పలుమార్లు మిమ్ముల్ని కోరారు.
Read also: Harsha sai : హర్షసాయి కేసులో ట్విస్ట్.. దాసరి విజ్ఞాన్ అరెస్ట్..
ఇప్పటికైనా మీరు వెంటనే స్పందించి కరీంనగర్లో జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నా అని లేఖలో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఇండ్ల పట్టాల్లో ఎవరైనా కొంతమంది అనర్హులు ఉంటే వాళ్లను తీసేసి ఏళ్ల తరబడి ఇదే వృత్తితో చాలీచాలని వేతనాలతో బ్రతుకు సాగిస్తున్న అర్హులైన జర్నలిస్టులందరి కీ అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందులో భాగంగా రద్దు చేసిన ఇండ్ల పట్టాలను వెంటనే పునరుద్దరించడంతోపాటు ఆ స్థలాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నా, జిల్లాలో అర్హులుగా ఉండి ఇండ్ల స్థలాలకు నోచుకోని మిగిలిన జర్నలిస్టులకు కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలి. ఈ విషయంలో మీరు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాఅని లేఖలో పేర్కొన్నారు.
Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్‌లో లుకలుకలు.. కేడర్‌కు చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యే మందుల సామేలు