మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్-బిలో ఉన్న ఇంగ్లీష్ జట్టు తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళలను ఓడించగా.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. సోమవారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఇంగ్లండ్ చిత్తుచేసింది. గ్రూప్ దశలో మరో విజయం సాధిస్తే.. ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకుంటుంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన ఎకిల్‌స్టోన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 124 పరుగులే చేసింది. ఓపెనర్ లారా వోల్వార్ట్ (42; 39 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. బ్రిట్స్ (13), అనెకె బాష్ (18), మరిజేన్ కాప్ (26), అన్నరీ డెర్క్సెన్ (20) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు సోఫీఎకిల్‌స్టోన్ (2/15), సారా గ్లెన్ (1/18), చార్లీ డీన్ (1/25) వికెట్స్ పడగొట్టారు.
Also Read: Rohit Sharma: 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడు!
ఛేదనలో ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నాట్ సీవర్ (48 నాటౌట్; 36 బంతుల్లో 6×4), డానీ వ్యాట్ (43; 43 బంతుల్లో 4×4) రాణించారు. ఛేదన ఆఖరి ఓవర్‌కు సాగినా.. మ్యాచ్ ఇంగ్లీష్ జట్టు నియంత్రణలోనే ఉంది. ఇన్నింగ్స్ మధ్యలో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగినా నాట్ సీవర్ జట్టును ఆడుకుంది. ఇప్పటికే రెండు విజయాలు అందుకున్న ఇంగ్లండ్.. మరో విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. స్కాట్లాండ్, వెస్టిండీస్ జట్లతో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది.