NCERT Books In Amazon: అమెజాన్‌తో విద్యా మంత్రిత్వ శాఖ ఒప్పందం.. అమెజాన్‌లో అందుబాటులోకి NCERT పుస్తకాలు
- అమెజాన్‌తో విద్యా మంత్రిత్వ శాఖ ఒప్పందం..
- అమెజాన్‌లో అందుబాటులోకి NCERT పుస్తకాలు.
- ఎంఆర్‌పీ ధరకు మాత్రమే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCERT Books In Amazon: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పుస్తకాలు ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో వారి ఇంటి వద్దకే అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుంది. దీని కింద పుస్తకాల కొరత, నకిలీ పుస్తకాల సమస్య, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు పుస్తకాలను కొనుగోలు చేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది. ఇప్పుడు ఇతర వస్తువుల మాదిరిగానే NCERT పుస్తకాలను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.
Deputy CMO: ఆహారంలో టీబీ బ్యాక్టీరియా కలిపి డిప్యూటీ సీఎంఓను చంపేందుకు యత్నం.. ఆడియో లీక్
Also Read
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, విద్యా మంత్రిత్వ శాఖ మధ్య ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో కూడా NCERT పుస్తకాలు అందుబాటులో ఉండేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్, విద్యా మంత్రిత్వ శాఖ మధ్య సహకారం ఏర్పాటు చేయబడింది. ఈ ఏడాది ఎన్‌సీఈఆర్‌టీ దాదాపు 15 కోట్ల పుస్తకాలను ప్రచురిస్తుందని, ఇది గతం కంటే మూడు రెట్లు ఎక్కువని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఏటా దాదాపు 5 కోట్ల పుస్తకాలు వెలువడుతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద పాఠశాల విద్య కోసం రూపొందించిన నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా ఎన్‌సిఆర్‌టి కొత్త పుస్తకాలను తీసుకువస్తోందని ఆయన చెప్పారు. దింతో ఇప్పుడు ఈ పుస్తకాలను ఇంట్లో కూర్చొని కూడా ఆర్డర్ చేయవచ్చు.
Rohit Sharma: 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడు!
ఈ పుస్తకాలు దేశవ్యాప్తంగా సుమారు 20,000 పిన్ కోడ్‌లలో ఎంఆర్‌పీ వద్ద అందుబాటులో ఉంచబడతాయి. దీని కారణంగా ఇప్పుడు పుస్తకాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన పుస్తకాలు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకే లభిస్తున్నాయని ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్ బిజినెస్ మేనేజర్ అమితాబ్ తెలిపారు. 65 రూపాయల విలువైన పుస్తకం అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో 200 నుండి 300 రూపాయలకు లభిస్తుందని, అయితే ఇప్పుడు ఈ పుస్తకాలు ఎంఆర్‌పీ ధరకు మాత్రమే లభిస్తాయని ఆయన చెప్పారు. ఇంకా మార్కెట్‌లో పుస్తకాలు అందుబాటులో లేకుంటే అమెజాన్ నుంచి సులువుగా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. NCERT 1963 నుండి పాఠ్యపుస్తకాలను ప్రచురిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 220 కోట్ల పుస్తకాలు, పత్రికలను ప్రచురించింది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు ప్రతి సంవత్సరం మూడు రెట్లు ఎక్కువ పుస్తకాలు ప్రచురించబడుతున్నాయి.
తాజావార్తలు
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?