ప్రేమ పేరుతో మోసం చేసి శారీరకంగా వాడుకుని, సినిమా పేరుతో రెండు కోట్లు డబ్బు తీసుకుని ,పెళ్లి కోవాలన్నందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి స్పృహలో లేనప్పుడు లైంగీకదాడికి పాల్పడ్డాడని, ఆ వీడియో రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు కేసు పెట్టింది.
కాగా హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో సోషల్ మీడియాలో అవాస్తవాలు మాట్లాడి యువతిపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయి మాట్లాడినందుకు దాసరి విజ్ఞాన్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. రేప్ కేసులో బాధితురాలి పై ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు సర్క్యూలేట్ చేస్తున్న వారిపై హై కోర్ట్ ఆగ్రహించింది.వీటిపై తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఆదేశించింది ధర్మాసనం. గూగుల్, యూట్యూబ్, మెటా కి కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఛానల్స్ బ్లాక్క్లిస్ట్ చేసే పనిలో ఉన్నారు సైబర్ టీమ్. దాసరి విజ్ఞాన్ , కరాటే కళ్యాణి , శేఖర్ బాషా , మహీధర్ వైబ్స్ పై సెక్షన్ 72 BNS , 356 (1) BNS 67 of IT Act 2008 కేసు నమోదు చేసిన పోలీసులు. హర్ష సాయికి సహకరిస్తున్న దాసరి విజ్ఞాన్ పై ఇప్పటికే ఆరు కేసులు ఉన్నట్టుగుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. చీటింగ్ , దొంగతనం, ఫుడ్ బిసినెస్ పేరుతొ 4 లక్షల మోసం, సినిమా తీస్తాను అని చెప్పి కెమెరాలు దొంగతనం చేసిన కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.