తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి నీటి వివాదాలు ఉండవద్దని కేంద్రం గెజిట్ విడుదల చేసింది. రెండు బోర్డుల చైర్మన్ లు హాజరు అయిన సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. బోర్డు సమావేశాలకు హాజరు కాకుండా తెలంగాణ సీఎం సాధించింది ఏంటో చెప్పాలి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశంలో కేసీఆర్ ఇంతా దుర్మార్గపు సీఎం ఎక్కడా లేరు. బోర్డు సమావేశంకు హాజరు అయితే ఏపీని అక్రమ ప్రాజెక్టులపై నిలదీసే అవకాశం ఉండేది. దేశంలో రోజు వారీ షెడ్యూల్ విడుదల చేయని సీఎం కేసీఆర్ ఒక్కరే అని తెలిపారు.
తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ పని చేస్తారా… పక్క రాష్ట్రము ప్రయోజనం కోసం కేసీఆర్ పని చేస్తారా అని ప్రశ్నించారు. 299 టీఎంసీల నీటిని తెలంగాణకు ఒప్పుకుని కేసీఆర్ ఎందుకు సంతకం పెట్టారు ? కేసీఆర్ సోయి లేకుండా ఉన్నారా అని అడిగారు. ఇచ్చిన 299 టీఎంసీల నీటిని కేసీఆర్ వాడుకోవడం లేదు. ఏపీ ప్రతి సంవత్సరం 150 టీఎంసీల నీటిని అదనంగా వాడుకుంటున్నారు. కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల డిపిఆర్ లు ఇవ్వడం లేదు. అన్ని విషయాలు బయటకు వస్తాయని బోర్డు సమావేశాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ కేసు విత్ డ్రా చేసుకుంటే కేసీఆర్ ఆ వివరాలు బయటపెట్టాలి. తెలుగు రాష్ట్రాల సీఎం లు కుమ్మక్కు అయి ప్రజలను మోసం చేస్తున్నారు. బోర్డు సమావేశాలకు హాజరు అయి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. లోపాయకారి ఒప్పందంతోనే బోర్డు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు అని పేర్కొన్నారు.