పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్న వారు ఇద్దరూ దొందు దొందే అని విమర్శించారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాజీనామా చేసి పోటీకి వెళ్ళాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని తెలిపారు. పార్టీ మారినప్పుడు రాజీనామా చేస్తేనే వారు మొగోళ్ళు లేదంటే ఆడంగులేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసిన వారు పోటీ చేస్తేనే వారు నిజమైన లీడర్లు అని వెంకట రమణారెడ్డి అన్నారు. పార్టీ మార్పిడిలు తప్పుడు నిర్ణయమని ఆయన తెలిపారు.
Read Also: CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
మరోవైపు.. రాష్ట్రంలో నలభై శాతం మించి రుణమాఫీ జరగలేదని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. పక్కింటి కుటుంబ సమస్యలను నోటికి వచ్చే విధంగా మాట్లాడే మంత్రులు ఉన్నారని ఆరోపించారు. కులగణన రాజకీయ గణన మాత్రమేనన్నారు. ఇదిలా ఉంటే.. మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిల మైండ్ సెట్ ఒకటేనని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వాన్ని కూలగొట్టే అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం కూలగొట్టే ఓపిక తమకు లేదన్నారు. అవిశ్వాసం అనేది ఒక ఎమ్మెల్యే మాట.. అది పార్టీ నిర్ణయం కాదని తెలిపారు. ప్రజల అసంతృప్తిని తాము ఎండగడుతామని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు.
Read Also: REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?