Kaleru Venkatesh: వచ్చే ఎన్నికల్లో రెండోసారి అంబర్పేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కెసిఆర్ కు కానుకగా ఇస్తానని అంబర్పేట్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడో సారి గెలుపు కాయమని కాచిగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సుందర్ నగర్, నెహ్రు నగర్ నెహ్రూ నగర్, అంజుమాన్ బాట పలు బస్తిలలో ఇంటింటికి తిరుగుతూ కాచిగూడ ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మన కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే ఇప్పుడు మనకు అందుతున్నాయని తెలిపారు. మీరు మళ్లీ అంబర్పేట్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాలేరు వెంకటేష్ కోరారు.
నిన్న చెప్పాల్ బజార్, పలు బస్తీలలో ఇంటింటికి తిరుగుతూ కాచిగూడ ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మన కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని మీరు మళ్లీ అంబర్పేట్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. మేనిఫెస్టోలో ఉంచిన అన్ని హామీలను నెరవేరుస్తామని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశారు.. అదే అంశాన్ని ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ మహిళలకు వివరించడం జరిగింది. ఈ ప్రచారంలో మహిళల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది.. మహిళల నుంచి వస్తున్న స్పందన ద్వారా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం తప్పకుండా సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.
Vizianagaram: వైద్యుల నిర్లక్ష్యం…. పిల్లలకు కాలం చెల్లిన వ్యాక్సిన్.