కేఏ పాల్.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వేళ హాట్ టాపిక్ అవుతున్న నేత.. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్ తప్పుకోవడంతో, కేఏ పాల్ చివరి నిమిషంలో మునుగోడు బరిలో పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేకపోవడంతో మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర్య అభ్యర్థిగా కేఏ పాల్ పోటీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో, ఆయన మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓటర్లను కలుస్తూ వారిని ఆకట్టుకుంటున్నారు. ఆయన తనదైన రీతిలో విన్యాసాలు, మాస్ డ్యాన్సులతో ప్రజలతో మమేకం అవుతున్నారు. తాజాగా ఓ ఫోక్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేశారు. చుట్టూ జనం గుమికూడగా, తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో అందరికీ వినోదం పంచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండురోజుల క్రితం ఆయన ఓ సెలూన్ లో కటింగ్ వేయించుకుని మరీ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.